బుధవారం, 3 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (17:16 IST)

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

Scooter
Scooter
మొన్నటికి మొన్న ఈవీ స్కూటర్‌ రిపేర్ కోసం ఓ వ్యక్తి భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చిందని ఆ వాహనాన్ని పగులగొట్టిన వీడియో నెట్టింట వైరల్ అయిన ఘటన మరవక ముందే కేరళలోని తిరూర్‌లో ఓ ఈవీ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. ఇలాంటి ఘటనలు ఈవీ వాహనాలకు కొత్తేమీ కాదు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరూర్, మలప్పురంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తుండగా మంటలు చెలరేగాయి. స్కూటర్‌పై వెళ్తున్న తల్లి, బిడ్డ వాహనం నుంచి పొగలు రావడాన్ని గమనించి వెంటనే కిందకు దిగారు.
 
కొద్దిసేపటికే స్కూటర్‌ మంటలు చెలరేగి ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేసింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, విచారణ కొనసాగుతోంది.