మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (14:18 IST)

బంగారమైన గోమూత్రం.. పాల ధర కంటే అధికం...

రాజస్థాన్ రాష్ట్ర రైతుల పాలిట గోమూత్రం బంగారంగా మారింది. ఫలితంగా లీటరు గోమూత్రం ధర రూ.30 నుంచి 50 రూపాయల ధర పలుకుతోంది. ఆవు పాల కంటే మూత్రం ధర అధికంగా ఉండటం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల

రాజస్థాన్ రాష్ట్ర రైతుల పాలిట గోమూత్రం బంగారంగా మారింది. ఫలితంగా లీటరు గోమూత్రం ధర రూ.30 నుంచి 50 రూపాయల ధర పలుకుతోంది. ఆవు పాల కంటే మూత్రం ధర అధికంగా ఉండటం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సాధారణంగా పుణ్యకార్యాల్లో గోమూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే, సేంద్రీయ వ్యవసాయంతో రాష్ట్రంలో ఆవు మూత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్కడి రైతులు హోల్‌సేల్ మార్కెట్లో గిర్, థార్పార్కర్ వంటి హైబ్రీడ్ ఆవుల మూత్రాన్ని లీటర్ రూ.15-30కి అమ్ముతున్నారు. 
 
రైతులకే అంత ధర వస్తుంటే వ్యాపారులు అదే మూత్రాన్ని లీటర్ రూ.30-50కి విక్రయిస్తున్నారు. అదే లీటర్ పాల ధర రూ.22-25 వరకు గిట్టుబాటు అవుతుండటంతో రాజస్థాన్ రైతులు గోమూత్రం అమ్మడమే జీవన వృత్తిగా మారుతున్నారు. 
 
ఆవు పాలతో పాటు గోమూత్రం కూడా అమ్మడంతో ఒక్కో పాడి రైతు కనీసం 30 శాతం ఆదాయ పెరుగుదలను కళ్ల జూస్తున్నాడు. సేంద్రీయ వ్యవసాయం చేసేవారు గోమూత్రాన్ని పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ఇది కాకుండా ఔషధాల్లో, పూజాదికాల్లో కూడా గోమూత్రాన్ని విరివిగా వినియోగిస్తున్నారు.