శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (09:18 IST)

దేశంలో నేటికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఓ యేడాది

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ గత యేడాది జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభిచారు. ఈ కార్యక్రమం గత యేడాది కాలంగా దిగ్విజయంగా సాగుతోంది. అంటే ఈ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించి ఒక యేడాది కాలం పూర్తి చేసుకుంది. ఫ్రంట్ లైన్ వారియర్లతో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ గత యేడాది కాలంలో ఎన్నో మైలు రాళ్లను అధికమించింది. 
 
టీకాపై ఎన్నో అపోహలు, భయాలు ఉత్పన్నమైన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్లు అందించడం ప్రారంభించింది. ఎన్నో అనుమానాల మధ్య ప్రారంభమైన ఈ ప్రక్రియ ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. 
 
ఈ వ్యాక్సినేషన్ ప్రారంభమైన నేటికి ఒక యేడాది పూర్తవుతున్న వేళ 156 కోట్ల కరోనా టీకాల పంపిణీ మైలురాయిని అధికమించింది. అందులో 90 కోట్ల మందికి పైగా మొదటి డోసు టీకా వేయగా, 62 కోట్ల మందికి రెండు డోసుల టీకాను వేశారు. 42 లక్షల మందికి బూస్టర్ డోస్ టీకాలను వేశారు. తద్వారా ప్రపంచంలోనే సరికొత్త రికార్డును నెలకొల్పారు. 
 
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు 5.2 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు 2.94 కోట్ల మొదటి డోస్ టీకాలను, 2.7 కోట్ల రెండు డోసుల టీకాలను పూర్తి చేశారు. అలాగే, కేవలం ఐదు లేదా ఆరు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది.