శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (10:01 IST)

24 గంటల్లో దేశంలో 23,529 కొత్త కరోనా కేసులు

చైనా వూహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇవాళ కాస్త పెరిగాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 23,529 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,39,980కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,77,020 కు చేరింది.
 
ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 311 మంది కరోనాతో మరణించ గా మృతుల సంఖ్య 4,48,062 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 28,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 88,34,70,578 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 65,34,306 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,30,14,898 కు చేరింది.