శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (17:54 IST)

కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ ఆర్మీ... ఎఫ్.బి. ఖాతాల డిలీట్‌కు ఆదేశం

భారత సైన్యం కూడా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 89 యాప్‌లను వినియోగించకూడదని భారత సైన్యానికి ఆదేశించింది. వీటిలో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ యాప్‌లు కూడా ఉన్నాయి. 
 
సైన్యంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు బ్యాన్ చేసిన 89 యాప్‌లలో ఏ ఒక్క దాన్ని కూడా వినియోగించకూడదని... ఫోన్లలో ఉన్నవాటిని తొలగించాలని ఆదేశించింది. ఈనెల 15లోగా ఈ యాప్‌లన్నింటినీ తొలగించాలంటూ జాబితాను విడుదల చేసింది. ‌
 
హనీట్రాప్, భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైన్యం హెచ్చరించింది. 
 
కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో టిక్ టాక్ వంటి అనేక ప్రముఖ యాప్‌లు ఉన్నాయి.

గాల్వాన్ లోయవద్ద చైనా బలగాల దాష్టీకానికి నిరసనగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇపుడు ఇండియన్ ఆర్మీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇపుడు సైన్యం నిషేధించిన యాప్‌ల జాబితా ఇదే: