శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 జులై 2019 (14:56 IST)

#PMModionDiscovery ''మేన్ వర్సెస్ వైల్డ్‌''లో మోదీ సాహసయాత్ర (వీడియో)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాహసం చేశారు. ఇప్పటికే రాజకీయాల్లో ప్రత్యర్థులను ఓ ఆట ఆడుకుంటున్న మోదీ.. అడవుల్లోకి వెళ్లారు. క్రూర మృగాలు, విష సర్పాలుండే ప్రాంతానికి వెళ్లారు. నదులు దాటారు.


అడవిలో వుండాల్సిన పరిస్థితుల్లో మోదీ ఎలా వుంటారనే విషయాన్ని తెలుసుకునేందుకు మరో 15 రోజుల పాటు ఆగాల్సిందే. ఎందుకంటారా? ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని #PMModionDiscovery అనే పేరిట డిస్కవరీ ఛానల్ ఓ హ్యాష్ ట్యాగ్‌ను వదిలిపెట్టింది. ఇంకా వీడియోను కూడా జత చేసింది. 
 
ఇంతకీ విషయమేంటంటే.. డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే పాపులర్ షో ''మేన్ వర్సెస్ వైల్డ్‌''లో త్వరలో మన ప్రధాన మంత్రి మోదీ కనిపించబోతున్నారు. ప్రపంచ ప్రముఖ సాహసవీరుడు బియర్ గ్రిల్స్‌తో కలిసి మోడీ చేసిన వైల్డ్‌ జర్నీని డిస్కవరీ ఛానెల్ ఆగస్టు 12న ప్రసారం చేయబోతోంది. భారత్‌లోని వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ మార్పులపై ఈ షోలో మోదీ చెప్తారని తెలుస్తోంది. 
 
దీనికి సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ షోను తప్పకుండా చూడాలని కోరుతూ బియర్ గ్రిల్స్‌ ఆ వీడియోను ట్వీట్‌ చేశాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారని కొనియాడారు. ఆయనలోని "వైల్డ్‌ యాంగిల్‌'ను చూడాలంటే ఆగస్టు 12వరకు వెయిట్‌ చేయండి'' అని ఆసక్తిని పెంచాడు. ఆ ప్రోమోను మీరూ ఓ లుక్కేయండి.