శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (18:48 IST)

అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌ గుట్టు రట్టు.. ఉద్యోగాల పేరిట యువతులను?

దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌ గుట్టు రట్టు అయ్యింది. ఢిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం అందింది. దీంతో వారణాసి క్రైం బ్

దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌ గుట్టు రట్టు అయ్యింది. ఢిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం అందింది. దీంతో వారణాసి క్రైం బ్రాంచ్, ఢిల్లీ పోలీసులు కలిపి నిర్వహించిన దాడుల్లో అంతర్జాతీయ సెక్స్ ముఠా గుట్టును రట్టు చేశారు.


ఉద్యోగాల పేరిట యువతులను నమ్మించి తీసుకొచ్చి.. సెక్స్ దందా నడుపుతున్నారని విచారణలో తేలింది. దీంతో సెక్స్ ముఠా నుంచి 18 మంది యువతులను పోలీసులు కాపాడారు. 
 
వీరిలో 16 మంది నేపాల్‌కు చెందిన వారని పోలీసులు చెప్పారు. ఇదో అక్రమ రవాణా ముఠా అని, యువతులను గల్ఫ్ దేశాలకు పంపించే ఉద్దేశంతో వారిని ఓ ఇంట్లో బంధించి ఉంచినట్టు పోలీసులు తెలిపారు.

ఇంటిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ గురించి నేపాలీ పోలీసులకు సమాచారం అందించినట్లు, వారు రాయబార కార్యాలయానికి ఈ విషయాన్ని చేరవేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.