సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (11:21 IST)

ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతి యోగా : రాష్ట్రపతి ముర్ము

yoga day
ఈ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతి యోగా అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, బుధవారం తొమ్మిదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని( 9th International Day of Yoga) ఘనంగా నిర్వహిస్తున్నారు. 
 
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ... ఐక్యరాజ్య సమితి వేదికగా జరిగిన యోగా కార్యక్రమానికి నేతృత్వం వహించారు. మరో వైపు కేంద్రమంత్రులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో యోగా కార్యక్రమాలను ముందుండి నడిపించారు. మంచుకొండల్లో ఆర్మీ నిర్వహించిన యోగా దినోత్సవ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
 
"అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు! యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. ఈ ప్రపంచానికి భారత్‌ అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటి. యోగా శరీరం, మనస్సు మధ్య సమతౌల్యం ఏర్పరుస్తుంది. యోగా.. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరుతున్నాను" అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అలాగే, అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. యోగా ఒక గ్లోబల్‌ మూవ్‌మెంట్‌గా మారిందని ప్రధాని మోడీ గుర్తుచేశారు.