మహిళలకు సువర్ణావకాశం.. ప్రధానమంత్రి స్కూటీ యోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నా కేంద్ర సర్కార్ వారి కోసం ఓ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హత కలిగిన బాలికలు, అతివలకు ఉచితంగా స్కూటీ ఆంధ్ర చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి స్కూటీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పదవ తరగతి తరువాత బాలికలు ఉన్నత చదువులకు వెళ్లిరావడానికి, ఉద్యోగాలు చేసి ఇళ్లకు వచ్చేందుకు ఇబ్బందులు లేకుండా స్కూటీలు అందించాలని కేంద్రం భావించింది.
అయితే ఈ పథకంలో అర్హులైన బాలికలు, మహిళలకు స్కూటీలు ఉచితంగా అందివ్వనున్నారు. ఈ ఏడాది మేలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించారు. దీని ప్రకారం ఆన్ లైన్ లో సర్కార్ యోజన వెబ్ సైట్ లోకి వెళ్లి స్కూటీ యోజన పథకానికి సంబంధించిన దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు కూడా జత చేయాలి. దరఖాస్తు పరిశీలించి అర్హత కలిగిన వారికి మాత్రమే స్కూటీని ఇవ్వనున్నారు.
ఈ నెల 30వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్, రేషన్ ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆన్ లైన్ లో దరఖాస్తుతోపాటు నమోదు చేయాలి. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పిస్తారు.
18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉండి, పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల లోపు ఉండాలి. పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్, రేషన్ కార్డుల్లో పేరు ఒకేలా ఉండాలి. పేర్లు తేడా ఉంటే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.