ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (13:30 IST)

భర్త సంగతిని పక్కనబెట్టు.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.. నాతో రా అన్నాడు..

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పెళ్లైనా పిల్లలున్నారన్నా.. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు ఓ ప్రబుద్ధుడు. భర్త వున్నాడని చెప్పినా.. అతనికి కంటే మిన్నగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానన్నాడు. చివరికి ఆమె నో చెప్పడంతో కత్తితో వెనుక నుంచి పొడిచి చంపేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని మధుబానీ జిల్లాకు చెందిన శ్యాంయాదవ్.. ఢిల్లీలోని ఓ షూ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అదే కంపెనీలో మాధురీ (45) అనే మహిళ పనిచేసేది. ఆమె శ్యాంయాదవ్‌కు బాగా నచ్చేసింది. ఆమెను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. అతనికి భయపడి కంపెనీ మారింది మాధురీ. అయినా శ్యాంయాదవ్‌‌ మారలేదు. ఇంటి అడ్రెస్ కనుక్కుని ఆమె వెంట పడేవాడు.
 
భర్తకంటే బాగా చూసుకుంటానని మాయమాటలు చెప్పేవాడు. కానీ మాధురీ అతని మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయం భర్తకు తెలిస్తే లేనిపోని అనుమానాలకు తావిచ్చినట్లు అవుతుందని మిన్నకుండిపోయింది. తన చుట్టూ తిరుగుతున్న వ్యక్తిని పోలీస్ కంప్లెంట్ ఇస్తానని బెదిరించింది. ఆమెపై పగ పెంచుకున్నాడు. 
 
తనకు దక్కని వ్యక్తి... మరొకరితో ఉండటమేంటని పిచ్చిగా ఆలోచించాడు. సైకో మెంటాలిటీ ఎక్కువైంది. ఓ రోజు కత్తి వెంటపెట్టుకొని ఆమెను ఫాలో అయ్యాడు. మాధురీ తన ఇంట్లోకి వెళ్తున్న టైంలో... ఆమెను వెనక నుంచీ పొడిచాడు.
 
ఆ దృశ్యాన్ని చూసిన మాధురీ కూతురు షాకైంది. మరుక్షణంలో... అదే కత్తితో మాధురిని ముందు నుంచి రెండుసార్లు పొడిచిన శ్యాంయాదవ్ పారిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే మాధురీ మరణించింది. ఈ ఘటనపై మాధురి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.