Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెల్లెలు రంగంలోకి దిగితే అన్న గతేమిటి?

హైదరాబాద్, మంగళవారం, 31 జనవరి 2017 (06:19 IST)

Widgets Magazine

భారత రాజకీయాల్లో 'మొదటి కుటుంబం' అయిదో తరం సభ్యురాలిగా ప్రియాంకా గాంధీకి ఉన్న ఆకర్షణ శక్తిని కాంగ్రెస్‌ వారితోపాటు మీడియా వ్యాఖ్యాతలు 20 ఏళ్లుగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయినా ఆమె రాజకీయాల్లోకి లాంఛనంగా చేరలేదు. 1999 నుంచీ లోక్‌సభ ఎన్నికల్లో తల్లి, సోదరుడి నియోజకవర్గాలు రాయ్‌బరేలీ, అమేధీలో క్రమం తప్పకుండా కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తూనే ఉన్నారు. దేశంలో, యూపీలో కాంగ్రెస్‌కు ఆశించినన్ని సీట్లురాని ప్రతిసారీ 'ప్రియాంకా లావో, కాంగ్రెస్‌కో బచావో' అని నెహ్రూగాంధీ కుటుంబం పుట్టినిల్లు అలహాబాద్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆమె రాజకీయాల్లోకి రాలేదు.
 
కానీ గత రెండు వారాలుగా ఉత్తరాది రాజకీయాల్లో జరిగిన రెండు ప్రముఖ ఘటనలు ప్రియాంకను ఒక్కసారిగా వెలుగులోకి తెచ్చాయి. ఆరు నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసి పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎటుపోవాలో తేల్చుకోలేక గందరగోళంలో ఉన్న మాజీ క్రికెటర్, అమృత్‌సర్‌ మాజీ ఎంపీ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూను జనవరి 15న కాంగ్రెస్‌లో చేర్పించడంలో ప్రియాంక కీలకపాత్ర పోషించారని వార్తలొచ్చాయి. 
 
తర్వాత వారం తిరగకుండానే యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ నేతత్వంలోని సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటు కుదర్చడంలో కూడా ఆమె ముఖ్య భూమిక పోషించారు. ఆమె కనౌజ్‌ ఎంపీ, యూపీ సీఎం అఖిలేశ్‌ భార్య డింపుల్‌తో, సీఎంతో మాట్లాడి కాంగ్రెస్‌కు 105 సీట్లిచ్చేలా ఒప్పించి, పొత్తును కాపాడారని కాంగ్రెస్‌ నేతలే మీడియాకు తెలిపారు. 
 
రాహుల్‌కి చేదోడుగా కొనసాగుతూనే  రాజకీయాల్లో క్రియాశీల పాత్రతో ప్రియాంక నిలదొక్కుకున్నాక మరో సమస్య తలెత్తే ప్రమాదముంది. భవిష్యత్తులో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వం, పార్టీ నాయకత్వాలను అన్నా చెల్లెళ్లు పంచుకోవడం కూడా అనుకున్నంత తేలిక కాదు. కాంగ్రెస్‌ గెలుపులో తన పాత్రను నిరూపించుకున్నాక ప్రియాంక పైన చెప్పినట్టు విజయలక్ష్మ్రి పండిత్‌లా అలంకారప్రాయమైన పదవులకే పరిమితం కావడం కూడా కష్టమే.
 
ఎస్పీ నేత ములాయంసింగ్‌ సోమవారం విమానంలో లక్నో నుంచి ఢిల్లీ వస్తూ తనతో మంచి సంబంధాలు లేని రాహుల్‌ గురించి ఒక్క మాట చెప్పలేదు. పియాంక ప్రస్తావన తెచ్చి ‘‘ఆమె చాలా తెలివైనది. నన్నెంతో గౌరవిస్తుంది.’’ అని ములాయం కితాబిచ్చారు. ఇలాంటి సందర్భాలు ఇక ముందు చాలా ఎదరౌతాయి.
 
రాజకీయాలంటే నాకు పెద్ద మోజు లేదు. జనమంటే ఇష్టం. నేను రాజకీయాల్లో లేకుండానే ప్రజలకు మేలు చేయగలను' అంటూ కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్‌ యువ నేత ప్రియాంకా గాంధీ వాద్రా అన్న మాటలు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. దేశ రాజకీయాల్లో ప్రత్యేకించి కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతోంది. ఇది ప్రియాంక శకం. ప్రియాంక రావటం వల్ల ఆమెకు ఒరిగే లాభమేమిటో కానీ, ఆమె సోదరుడు రాహుల్‌కి మాత్రం నష్టకరమే అని చెప్పాలి. ప్రియాంక ఆకర్షణ ముందు రాహుల్ నిలబడలేరన్నది ఎప్పుడో రుజువైంది. ఇక నుంచి అదే నిజం కానుందా?
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు Congress Up Elections Priyanka Gandhi

Loading comments ...

తెలుగు వార్తలు

news

డెల్టాను ఎండబెట్టారు.. రైతుల ఉసురు తీశారు.. మీరు మనిషేనా బాబూ: జగన్ ధ్వజం

కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన వైకాపా అధినేత వైఎస్‌ ...

news

ఇలా చేస్తే అమెరికాలో ట్రంప్ బారి నుంచి బయటపడవచ్చట ఎలా?

ఉగ్రవాదుల కట్టడి విషయంలో ఇచ్చిన మాట మేరకు అన్నంత పనీ చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ...

news

ఎప్పుడు ప్రకటించామన్నది కాదయ్యా పవన్.. ఇచ్చామో లేదో చూడవేం.. వెంకయ్య బుసబుస..!

ఒకరేమో సినిమాల్లో పంచ్ డైలాగుల కింగ్. మరొకరేమో రాజకీయాల్లో తిరుగులేని పంచ్ డైలాగుల కింగ్. ...

news

హోదాలో ఏముంది బొంద. అన్నీ ప్యాకేజీలో ఉంటే.. అంటున్న వెంకయ్య

ప్రత్యేక హోదా అంటూ పాత చింతకాయపచ్చడిని పట్టుకు వేళ్లాడుతున్నఏపీ ప్రతిపక్షాలకు కేంద్రం ...

Widgets Magazine