బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (14:19 IST)

చిక్కుల్లో సోనూసూద్.. రూ.20 కోట్లు ఎగవేశారు..

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంట్లో వరుసగా మూడు రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే నటుడు సోనూసూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసినట్టు ఇవాళ ఆ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
సోనూసూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు సమీకరించిందని ఐటీశాఖ చెప్పింది. నటుడికి సంబంధించిన ఇండ్లు, అతని అసోసియేట్స్ ఇండ్లు, ఆఫీసుల్లో నిర్వహించిన తనిఖీలు పన్ను ఎగవేతకు చెందిన అనేక పత్రాలు దొరికినట్టు ఐటీశాఖ తెలిపింది.
 
అయితే రాజకీయ కక్షతోనే సోనూ సూద్‌పై ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అతను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి, దేశ్ కా మెంటార్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే సోనూపై ఇలా ఐటీ దాడుల జరగడంపై సోషల్ మీడియాలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.