బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

జమ్మూకాశ్మీర్‌లో కాల్పులు: లఖ్వీ మేనల్లుడి హతం...

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు లష్కర్ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ మేనల్లుడు సహా ఇద్దరు లష్కర్ కమాండర్లు ఉన్నారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో ఐఏఎఫ్ గరుడ కమ

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు లష్కర్ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ మేనల్లుడు సహా ఇద్దరు లష్కర్ కమాండర్లు ఉన్నారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో ఐఏఎఫ్ గరుడ కమాండో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో బందిపొరా జిల్లా చందర్‌గీర్‌ గ్రామంలోని హజిన్‌ ప్రాంతాన్ని సైన్యంతో పాటు సీఆర్‌పీఎఫ్‌, ఉగ్రవాద నిరోధక బృందాలు చుట్టిముట్టాయి. ఉగ్రవాదుల ఆచూకీ కనుగొనేందుకు సోదాలు జరుపుతుండగా టెర్రరిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. 
 
దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్టు ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కలియా తెలిపారు. లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో బందీపోరా జిల్లాలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.