న్యాయమూర్తులపై కర్ణన్ సెన్సేషనల్ కామెంట్స్: సుప్రీం సీరియస్.. ఆయన మానసిక పరిస్థితి ?

శుక్రవారం, 31 మార్చి 2017 (14:55 IST)

దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ సంచలన ప్రకటన చేశారు. సుప్రీం కోర్టులోని ఏడుగురు న్యాయమూర్తులు.. న్యాయ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. గతంలో చెన్నై హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా కర్ణన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఉత్తరం రాశారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జికి సుప్రీంకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం ద్వారా ఆయనపై కోర్టు కేసు పెట్టింది. 
 
దీనిపై జరిపిన విచారణ సందర్భంగా తాను దోషిని కానని.. న్యాయమూర్తిగా తన విధులను నిర్వర్తించేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశమిస్తే.. తాను చేసిన ఆరోపణలను రూఢీ చేస్తానని.. అలా చేయని పక్షంలో తనను జైలులో పెట్టండి అంటూ కోరారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం కర్ణన్ విజ్ఞప్తిని తిరస్కరించింది.

కాగా తనకు అధికారం ఉంటే.. సుప్రీం కోర్టులోని ఏడుగురు న్యాయమూర్తులపై ఉత్తర్వులు జారీ చేస్తానని వారిపై అవినీతిపై చర్యలు తీసుకుంటానని కర్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఇంకా కర్ణన్ తన వ్యాఖ్యలపై నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని గడువు విధించింది. 
 
చెన్నై హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కర్ణన్.. కోల్ కతాకు గత ఏడాది బదిలీ అయ్యారు. చెన్నై  హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తూ.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రులకు ఓ లేఖ పంపారు. దీంతో కర్ణన్‌పై సుప్రీం కోర్టు కేసు పెట్టింది. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కర్ణన్ కోర్టులో హాజరుకాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతేగాకుండా కర్ణన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆయేషా రేప్, మర్డర్ చేసింది ఎవడో? సత్యం బాబు జీవితం నాశనమైంది... పోలీసులు బాగు చేస్తారా?

2007లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఆయేషాపై అత్యాచారం, ఆపై హత్య. ఈ కేసుపై ...

news

ఆర్కే నగర్ ఉప ఎన్నికలు: ఓపీఎస్ అష్టోత్తర శత హామీలు-దేశంలోనే తొలి ఎమ్మెల్యే ఆఫీస్

తమిళనాట ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకీ హీటెక్కుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకేకు ...

news

ఎపిలో కొత్త మంత్రులు వీరే... ఇది ఫైనలట...? ప్రత్తిపాటి పుల్లారావుకు ఊడుతుందా?

తెలుగుదేశంపార్టీలోకి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో మంత్రులను తీసుకోలేదన్న ...

news

హోంమంత్రిగా నారా లోకేష్‌...? మరి చినరాజప్ప?

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి పెద్దల సభలో మొదటిసారి అడుగుపెట్టిన నారా లోకేష్‌కు ...