శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:16 IST)

శశికళ ఓ నిశాని... ప్రజలు ఎన్నుకున్న వారే పరిపాలించాలి: దీప

తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు శశికళ నటరాజన్ అర్హులురాలు కాదని ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. పైగా, శశికళ ఓ నిశాని అంటూ ఘాటైన విమర్శలు చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు శశికళ నటరాజన్ అర్హులురాలు కాదని ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. పైగా, శశికళ ఓ నిశాని అంటూ ఘాటైన విమర్శలు చేశారు.
 
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శశికళ సర్వం సిద్ధం చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై దీపతో పాటు.. అన్ని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై దీప స్పందిస్తూ... ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులే రాష్ట్రాన్ని పరిపాలించాలన్నారు. 
 
తనను నమ్మిన వారికి ఏదైనా చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నానన్నారు. ప్రస్తుతం తమిళనాడు ప్రజలు స్వాతంత్య్రం కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులే పరిపాలించాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రజలకు వేరే అభిప్రాయమే లేదన్నారు. 
 
ఇంత వరకు ఓర్చుకున్నామని... ఇక మంచి భవిష్యత్తు కోసం పోరాడుదామని సూచించారు. ప్రజల కోసం బతికే వాళ్లు రాష్ట్రాన్ని పరిపాలించాలని, జయలలిత పేరు మరుగునపడకుండా కాపాడటం తమ కర్తవ్యమని తెలిపారు. తప్పకుండా అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.