శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (05:23 IST)

జయలలిత ఆరోగ్యంపై కరుణానిధి ఆరా.. అమ్మ కోలుకోవాలని ట్వీట్.. స్టాలిన్ కూడా?

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై... డీఎంకే అధినే కరుణానిధి ఆరాతీశారు. అమ్మ త్వరలో పూర్తిగా కోలుకోవాలని ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. గత సెప్టెంబర్ 22వ తేదీ సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెల

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై... డీఎంకే అధినే కరుణానిధి ఆరాతీశారు. అమ్మ త్వరలో పూర్తిగా కోలుకోవాలని ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. గత సెప్టెంబర్ 22వ తేదీ సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు నెలలకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని గ్రీమ్స్ రోడ్ అపోలోలో జయలలితకు విదేశీ, ఎయిమ్స్ డాక్టర్లు వైద్యం అందించారు.  
 
ఈ నేపథ్యంలో నవంబర్ 19వ తేదీ స్పెషల్ రూమ్‌కు జయలలితను మార్చినట్లు సమాచారం అందింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం అమ్మకు గుండెనొప్పి వచ్చిందని.. ఆమెక ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. జయలలితకు ఏడీఎంకే చీఫ్ ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. తమిళనాడు సీఎం జయలలితగారి ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా డీఎంకే కోశాధికార, విపక్ష నేత స్టాలిన్ కూడా అమ్మ కోలుకోవాలని ఆశించారు. అమ్మ ఇచ్చే చికిత్స ఫలించాలని ఆకాంక్షించారు.