శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (10:06 IST)

కొడనాడు ఎస్టేట్ దోపిడీ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయ్.. తస్మాత్ జాగ్రత్త... జయలలిత కారు డ్రైవర్

కొడనాడు ఎస్టేట్ దోపిడీ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయ్ జాగ్రత్త అంటూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత కారు డ్రైవర్ కనకరాజ్ దోపిడీ దొంగలను హెచ్చరించాడు. పైగా, ఈ దోపిడీ కేసుతో సంబంధం ఉన్న ఓ మాజీ మంత్రిని పోలీసులు

కొడనాడు ఎస్టేట్ దోపిడీ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయ్ జాగ్రత్త అంటూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత కారు డ్రైవర్ కనకరాజ్ దోపిడీ దొంగలను హెచ్చరించాడు. పైగా, ఈ దోపిడీ కేసుతో సంబంధం ఉన్న ఓ మాజీ మంత్రిని పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. కొడనాడు ఎస్టేట్‌లో గత నెల 24వ తేదీన దోపిడీ జరిగిన విషయం తెల్సిందే. ఈ ఎస్టేట్ సెక్యూరిటీ గార్డులను హత్య చేసి దోపిడీ జరిగింది. 
 
ఇందులో దోపిడీకి పాల్పడిన వారిలో ఇద్దరు జయకు గతంలో డ్రైవర్లుగా పని చేసిన వారు కాగా, మిగతా వాళ్లంతా చిల్లర దొంగలు. పైగా దోపిడీ సొమ్ము తీసుకెళ్లే సమయంలో ఇద్దరు డ్రైవర్లు తోటిదొంగల మొహాన రెండు లక్షలు పడేసి, ‘‘ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలున్నాయ్‌. హద్దు మీరి డబ్బులడిగితే మీకే ముప్పు’ అంటూ హెచ్చరించారు. 
 
ఈ దోపిడీ కేసు విచారణలో పోలీసులకు అనేక వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. జయ మాజీ డ్రైవర్‌ కనకరాజ్‌ దోపిడీని ముందుండి నడిపించాడని పోలీసులు అరెస్టు చేసిన నిందితులు షంషీర్‌ అలీ(32), జిత్తన్‌జాయ్‌(20) వెల్లడించారు. పెద్ద తలకాయలున్నాయ్‌ అన్న మాట జారిన కనకరాజ్‌.. కొద్ది రోజులకే అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం గమనార్హం. 
 
కనకరాజ్‌తో పాటు దోపిడీలో పాల్గొన్న జయలలిత మరో మాజీ డ్రైవర్‌ సయాన్‌ ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. అతడిని విచారిస్తేగానీ పూర్తి చిత్రం అందుబాటులోకి రాదని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలావుండగా, ఈ దోపిడీలో మొత్తం 11 మంది దొంగలు దొంగతనానికి ముందు ఒక మాజీ మంత్రి ఇంట్లో టీ తాగినట్లు ఆధారాలు దొరికాయి. దాంతో దోపిడీ వ్యవహారంలో పెద్ద మనుషుల ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు బలపడుతున్నాయి. మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది.