1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (10:01 IST)

అవును.. అమ్మను ఊపిరాడని స్థితిలోనే తీసుకొచ్చారు.. ప్రతాప్ రెడ్డి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. జయలలితను అపోలోకు ఊపిరాడని స్థితిలోనే తీసుకొచ్చారని అపోలో ఆసుపత్రుల వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు. జయలలిత మరణంపై అనుమానా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. జయలలితను అపోలోకు ఊపిరాడని స్థితిలోనే తీసుకొచ్చారని అపోలో ఆసుపత్రుల వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు.

జయలలిత మరణంపై అనుమానాలున్నాయని ప్రజలు, విపక్షాలు చెప్తున్న నేపథ్యంలో.. ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతారెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబరు 12 రాత్రి జయ ఊపిరాడని స్థితిలోనే చేరారని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు చివరికి ఫలితం మాత్రం అందరూ ఊహించినట్టుగా కాకుండా వేరేలా వచ్చిందన్నారు. 
 
కాగా జయలలిత మరణంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతున్న తరుణంలో.. ఇన్నాళ్లు జయలలిత చికిత్స పట్ల ఏవేవో చెప్పుకొచ్చిన అపోలో యాజమాన్యం ప్రస్తుతం నిజాలను వెల్లడించింది. ఇందులో భాగంగా అపోలో గ్రూప్ సంస్థల ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి నోరు విప్పారు. జయలలితను చాలా క్రిటికల్ పొజిషన్‌లో హాస్పిటల్‌కు తీసుకొచ్చారని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. ఆమెను బతికించేందుకు డాక్టర్లు చాలా ప్రయత్నించారన్నారు. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువగా వుండటంతో పరిస్థితి విషమించిందని చెప్పారు. 
 
ప్రజల భావోద్వేగాలను గుర్తుపెట్టుకుని ఆమె ఆరోగ్యం పట్ల నిజాలను బయటికి చెప్పవద్దని ఆదేశాలు రావడంతో వాస్తవాలను బయటికి చెప్పలేకపోయామని తెలిపారు. హై షుగర్ కారణంగానే జయలలిత మరణించారు. 500 పాయింట్స్ షుగర్ పెరగడంతో ప్రాణాలు కోల్పోయారని వార్తలు వస్తున్నాయి.