శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (15:44 IST)

ప్రధాని ఫోటోతో జియో ఫ్రీ పబ్లిసిటీ.. ఫైన్ ఎంతో తెలిస్తే నవ్వుకుంటారు.. అక్షరాలా రూ.500 మాత్రమే?

జాతీయ చిహ్నాలు, మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఐక్యరాజ్యసమితి, అశోక్ చక్ర, ధర్మ చక్రాలు, ప్రధాన మంత్రులు, గవర్నర్ను, ముఖ్యమంత్రుల బొమ్మల్ని ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్ సంస్థలు ఉపయోగి

జాతీయ చిహ్నాలు, మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఐక్యరాజ్యసమితి, అశోక్ చక్ర, ధర్మ చక్రాలు, ప్రధాన మంత్రులు, గవర్నర్ను, ముఖ్యమంత్రుల బొమ్మల్ని ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్ సంస్థలు ఉపయోగించకూడదు. అయితే రిలయన్స్ జియో లైఫ్ పేరుతో డెడికేటెడ్ టూ ఇండియా అండ్ 1.2 బిలియన్ ఇండియన్స్ పేరుతో ప్రధాన మోడీ ఫొటో అతి పెద్ద యాడ్ పేపర్లలో ఇచ్చింది. 
 
దీనిపై స్పందించిన కేంద్రం.. ప్రధాని మోడీ ఫొటో ఉపయోగించటానికి ఎవరికీ ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సంబంధిత మంత్రి రాథోడ్.. ఆయా కంపెనీలకు రూ.500 ఫైన్ విధించే అవకాశం ఉందని తెలిపారు. జియో వేసిన ఫైన్‌ను తెలుసుకున్న ప్రజలు షాక్ అవుతున్నారు. వామ్మో దేశంలో అగ్రగామి సంస్థగా పేరున్న జియోకు చాలా ఎక్కువగా రూ.500 ఫైన్ వేశారే అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మామూలుగా రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ వయిలేట్ చేస్తే కనీసం వెయ్యి రూపాయలు వేస్తారు.. అలాంటిది ప్రధాని మోడీ బొమ్మనే దేశవ్యాప్తంగా వాడేస్తే.. ఇంత పెద్ద ఫైన్ చేయటం అంటే మాటలా అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.
 
కాగా, రిలయన్స్ జియో.. డిజిటల్ భారతంలో సంచలనం. మార్కెట్ లోకి వచ్చిన రెండు నెలల్లోనే 5 కోట్ల మంది కస్టమర్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా ప్రధాని మోడీ ఫొటోలను ఉపయోగించింది. దీంతో ఫ్రీ పబ్లిసిటీ కూడా పొందింది. పెద్ద నోట్ల రద్దుతో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వ్యాలెట్ కంపెనీ పేటీఎం కూడా మోడీ ఫొటోను ఉపయోగించింది. ఇదే విషయాన్ని లోక్ సభలో ప్రస్తావించారు సమాజ్ వాది ఎంపీ నీరజ్. 
 
దీనికి సమాధానమిస్తూ ఇప్పటి వరకు దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని.. వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్. అనుమతి లేకుండా ప్రధాని మోడీ ఫొటోను ఉపయోగిస్తే నిబంధనల ప్రకారం 500 రూపాయల ఫైన్ ఉంటుందని చెప్పారు. రాథోడ్ ఫైన్ వ్యవహారంపై ప్రస్తుతం ప్రజలు మండిపడటంతో పాటు.. ప్రతిపక్షాలు కార్పొరేట్ సంస్థలకు మోడీ ఎప్పుడు అండగా ఉంటారని.. సామాన్య ప్రజలపైనే మోదీ నోట్ల రద్దుతో అష్టకష్టాలకు గురిచేస్తారని ఫైర్ అవుతున్నాయి.