సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జులై 2022 (21:48 IST)

వింత ఇన్ఫెక్షన్.. 40 ఆవులు మృతి..

cows
రాజస్థాన్‌, పాకిస్థాన్‌కు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లోని ఆవులకు వింత ఇన్ఫెక్షన్ కలకలం సృష్టించింది. జోధ్‌పూర్ గ్రామీణ ప్రాంతాలు, జైసల్మేర్‌తో సహా ఇతర ప్రాంతాలలో ఆవులలో కనిపించిన ఇన్ఫెక్షన్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
 
దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఆవులు చనిపోయాయి. ఆవులకు అంటువ్యాధులు సోకి వేగంగా చనిపోవడంతో పశువుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
జోధ్‌పూర్‌లోని లోహవత్ పల్లి 2 గ్రామంలో గత రెండు-మూడు రోజుల్లో, ఈ అంటు వ్యాధి కారణంగా సుమారు 40 ఆవులు మరణించాయి.
 
ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు.
 
ఈ ఇన్ఫెక్షన్ ఆవులలో అకస్మాత్తుగా వ్యాపిస్తుంది. అదే సమయంలో, చాలా ఆవులలో ఈ వ్యాధి కారణంగా, పుట్టబోయే ఆవు దూడలు కూడా కడుపులోనే చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.