తెలుగు జాతికి ద్రోహం... అందుకే ఆర్కే నగర్‌లో 'అమ్మ'పై పోటీ చేస్తున్నా... కేతిరెడ్డి
తమిళనాడులో తెలుగు జాతికి ద్రోహం చేసిన 'అమ్మ' జయలలితపై తను పోటీకి దిగుతున్నట్లు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తమిళనాడు తెలుగు యువశక్తి తరపున ఎన్నో కార్యక్రమాలు చేశామనీ, అవన్నీ తెలుగుజాతి బాగు కోసమేనంటూ చెప్పుకొచ్చ
తమిళనాడులో తెలుగు జాతికి ద్రోహం చేసిన 'అమ్మ' జయలలితపై తను పోటీకి దిగుతున్నట్లు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తమిళనాడు తెలుగు యువశక్తి తరపున ఎన్నో కార్యక్రమాలు చేశామనీ, అవన్నీ తెలుగుజాతి బాగు కోసమేనంటూ చెప్పుకొచ్చారు. తను జయలలితకు వ్యతిరేకంగా బరిలోకి దిగడంపై మాట్లాడుతూ... కరుణానిధి తెచ్చిన అన్నీ చట్టాలను రద్దు చేసిన జయలలిత నిర్బంధ తమిళం అంటూ తెలుగు భాషను తొక్కేసే చట్టాన్ని ఎందుకు రద్దు చేయలేదో తమకు అర్థం కాలేదు.
ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జయలలిత తెలుగువారిపై ఎంత చిన్నచూపు చూసిందో అర్థమవుతుంది. ఇప్పటికైనా అల్పసంఖ్యాక వర్గాల సమస్యలు తీరుస్తామని హామీ ఇస్తే తాను పోటీ నుంచి నిష్క్రమించుకుంటానని తెలిపారు. ఆర్కే నగర్‌లో దాదాపు 1.2 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నారనీ, చెన్నై నగరంలో తెలుగు ప్రజలు నివశించే ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పనలో కూడా తెలుగువారి పట్ల చిన్నచూపు ఉందనీ, ద్రావిడ పార్టీలు తెలుగువారి బాగుకంటే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయనీ ఆరోపించారు. కాగా ఆర్కే నగర్ బరిలో పోటీకి దిగేందుకు కేతిరెడ్డి నేడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.