ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (18:52 IST)

మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడం కుదరదు: కమల్ హాసన్

సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న తరుణంలో.. మక్కల్ నీధి మయ్యమ్ పార్టీని ఆవిష్కరించిన సినీ లెజెండ్ కమల్ హాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మద్

సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న తరుణంలో.. మక్కల్ నీధి మయ్యమ్ పార్టీని ఆవిష్కరించిన సినీ లెజెండ్ కమల్ హాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించలేమని.. అలా చేస్తే నష్టం తప్పదని కమల్ వ్యాఖ్యానించారు.
 
మద్యాన్ని ఒక్కసారిగా మానేస్తే మనిషి శరీరం అందుకు సహకరించదని.. మందు తాగడాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నమైతే చేయవచ్చునని కమల్ హాసన్ తెలిపారు. ఉన్నట్టుండి మద్యం మానితే మనిషి శరీరం సహకరించదని చెప్పారు. మందు తాగడాన్ని క్రమంగా తగ్గించగల ప్రయత్నమైతే చేయవచ్చని... పూర్తిగా ఆపించడం జరుగుతుందని తాను భావించట్లేదని తెలిపారు. 
 
కేవలం మహిళా ఓటర్లను బుట్టలో వేసుకునేందుకే పూర్తిగా మద్యపాన నిషేధం నాటకాన్ని రాజకీయ చేతికెత్తుతున్నారని విమర్శించారు. పాఠశాలల దగ్గర లిక్కర్ షాపులు ఉండటం పట్ల తాను ఎక్కువగా ఆందోళన చెందుతున్నానని తెలిపారు. ప్రజలకు ఉచితంగా ఏదైనా ఇచ్చే కార్యక్రమాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం కుదరదని కమల్ హాసన్ తెలిపారు. ప్రజల జీవనస్థాయిని పెంచేందుకు సరైన మార్గాలను అన్వేషించాలని చెప్పుకొచ్చారు.