మోడీ ప్యాంట్లు వేసుకోకముందు నుంచే ఇండియన్ ఆర్మీ వుంది : కమల్ నాథ్

kamal nath
Last Updated: సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:08 IST)
భారత ఆర్మీ విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే విమర్శించడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిస్టర్ మోడీ.. మీరు ప్యాంట్లు, పైజామాలు వేసుకోకముందు నుంచే ఇండియన్ ఆర్మీ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సలహా ఇచ్చారు.

అంతేకాకుండా, మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ హయాంలోనే భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం పటిష్టంగా రూపుదిద్దుకున్నాయని గుర్తుచేశారు. పైగా, తనను భ్రష్ట్ నాథ్(అవినీతికి అధిపతి)అని మోడీ పిలవడంపై కూడా కమల్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ఇప్పటివరకూ నరేంద్ర మోడీ హయాంలోనే అత్యధిక ఉగ్రదాడులు జరిగాయన్నారు. 2001లో ఎవరి హయాంలో పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా భారత్ తమ హయాంలోనే సురక్షితంగా ఉందంటూ మోడీ డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై మరింత చదవండి :