Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కర్నాటకలో పవన్ పార్టీ క్సెరాక్స్... స్థాపించబోయేది ప్రముఖ నటుడే...

ఆదివారం, 13 ఆగస్టు 2017 (13:58 IST)

Widgets Magazine
Upendra

వైవిధ్యమైన చిత్రాలతో అటు కన్నడ, ఇటు తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన కన్నడ నటుడు ఉపేంద్ర రాజకీయాల్లోకి రానున్నారు. సొంత పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. తన సొంత రాష్ట్రం కర్ణాటకలోనే పార్టీ పెట్టబోతున్నారు ఉపేంద్ర. ఇప్పటికే రాజకీయ సలహాదారులు, కర్ణాటకలోని కొన్నిపార్టీలకు చెందిన సీనియర్ నేతలతో ఉపేంద్ర చర్చలు కూడా జరిపారు. ఎపిలో పవన్ కళ్యాణ్‌ ఎలాగైతే పార్టీ పెట్టి ప్రకటనలు చేస్తున్నారో..అలాగే ఉపేంద్ర కూడా పవర్ కోసం కాదు.. ప్రశ్నించడానికే అన్న నినాదాంతో పార్టీ పెట్టబోతున్నారు. అయితే పార్టీ పేరు మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
 
విలక్షణ నటుడు ఉపేంద్ర తెలుగులో ఎంతోమంది సీనియర్ నటులతో కలిసి సినిమాల్లో నటించారు. స్వతహాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈయన కన్నడ సినిమాల్లో నటించి ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నారో తెలుగు, తమిళ బాషల్లో కూడా నటించి అంతే మంది అభిమానులకు చేరువయ్యారు. ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని ఉపేంద్ర అనుకోలేదు. అయితే గత కొన్నినెలలుగా కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉపేంద్ర రాజకీయాల్లోకి రావాలనుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఉపేంద్రకు కర్ణాటక రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ నమ్మకంతోనే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారట. మొదటగా ప్రజల్లోకి వెళ్ళాలి.. అధికారం కోసం కాదు.. ప్రజా సమస్యలను ప్రశ్నించడానికే అని ఉపేంద్ర చెబుతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే కర్ణాటక రాష్ట్రంలో కొత్త పార్టీ పురుడు పోసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Upendra Karnataka Kannada Star Pawan Kalyan New Political Party

Loading comments ...

తెలుగు వార్తలు

news

నర్సులే డెలివరీ చేశారు.. కవలలు పుట్టారు.. అంబులెన్స్ అందకపోవడంతో..

మాతాశిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ.. వాటి అమలులో ...

news

అంబిక, అంబాలికల్లా.. ఇకపై వితంతువులు కూడా సంతానం పొందవచ్చు..

మహాభారతంలో విచిత్ర వీర్యుడు మరణించడంతో వితంతువులైన అంబిక, అంబాలికలకు ధృతరాష్ట్రుడు, ...

news

చేయి లేకపోతే ఏం... చల్తా హై... జాలీగా వుంటా గురూ అంటున్న యువతి

అంగవైకల్యం అనగానే చాలామంది కుంగిపోతుంటారు. పుట్టుకతో వచ్చే అంగవైకల్యం సంగతి అలా వుంచితే ...

news

సినిమాల్లో అవకాశం ఇస్తానని.. అశ్లీల షార్ట్ ఫిల్మ్‌లో నటింపజేశారు..

సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి.. ఓ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని మోసగించిన ...

Widgets Magazine