ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (10:36 IST)

యూపీలో దారుణం.. భార్య ముక్కు కోసి.. కుమార్తెను ఉరివేసి.. ఆపై సూసైడ్

hang
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. తొలుత బ్లేడుతో భార్య ముక్కు కోశాడు. ఆ తర్వాత ఈడొచ్చిన కుమార్తెకు ఉరివేసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ దారుణం ఘటన జరిగింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, కాన్పూర్‌కు చెందిన ఛోటూ షా తన భార్య రుక్సర్‌పై అనుమానం మొదలైంది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి గొడవపెట్టుకునేవాడు. ఈ క్రమంలో గురువారం మరోసారి వారి మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో కోపోద్రిక్తుడైన ఛోటూ షా బ్లేడుతో రుక్సర్ ముక్కును కోసేశాడు. అడొచ్చిన కుమార్తె అర్జు (12)ను ఉరివేసి చంపాడు. అనంతరం ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.