గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (18:07 IST)

ఆ ఇద్దరూ మోసగాళ్లే.. కాపుల్ని ముంచారు.. కేవలం ఓటు బ్యాంకుగానే?: సత్యనారాయణ

కాపు రిజర్వేషన్లపై ఈ నెల 24లోపు స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోతే.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ సీఎం చంద్రబాబును కాపు జేఏసీ నేతలు హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహ

కాపు రిజర్వేషన్లపై ఈ నెల 24లోపు స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోతే.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ సీఎం చంద్రబాబును కాపు జేఏసీ నేతలు హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి.. ఇద్దరూ కూడా కాపులను మోసం చేశారన్నారు. చంద్రబాబు, జగన్ తమను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని కాపు జేఏసీ నేత సత్యనారాయణ ధ్వజమెత్తారు. 
 
ద్వంద్వ వైఖరితో ఎన్నికలకు వెళ్లిన జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. ఇక చంద్రబాబును ఎవరూ అడగకపోయినా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ నాలుగేళ్లలో ఏదో సాకుతో కాలయాపన చేశారన్నారు. గత ఎన్నికల్లో కేవలం రెండు శాతం‌ ఓట్ల తేడాతోనే గెలిచిన విషయాన్ని బాబు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 
 
ఈ ఇద్దరు నేతలు కూడా కాపులకు అనుకూలంగా ప్రకటనలు చేసి ఆ తరువాత యూ-టర్న్ తీసుకున్నారని సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదని చెప్పిన మాట వాస్తవమే అయినా... దాన్ని మార్చేలా పార్లమెంటులో చట్టం చేసే అవకాశం ఉందని, ఆదిశగా ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని సత్యనారాయణ ప్రశ్నించారు. 
 
గతంలో బలిజలకు రిజర్వేషన్లు ఇవ్వనని‌ చెప్పిన జగన్.. పార్టీ మేనిఫెస్టోలో మాత్రం పెట్టారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడేమో రిజర్వేషన్ల అంశం ‌కేంద్రం పరిధిలో ఉందని యూ టర్న్ తీసుకొని కాపులను మోసం చేశారని విమర్శించారు.