స్ట్రెచర్ ఇవ్వలేదు.. ల్యాబ్‌కు కాళ్లుపట్టుకుని భర్తను ఈడ్చుకెళ్లిన భార్య.. ఎక్కడ?
శుక్రవారం, 2 జూన్ 2017 (17:39 IST)
ఆంబులెన్సు, వీల్ ఛైర్, స్ట్రెచర్‌లు లేని కారణంగా రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఆంబులెన్సులు లేకపోవడంతో ఉత్తరాదిన శవాలను భుజాన మోసుకెళ్లిన వార్తలు వింటూనే ఉన్నాం. ఇదే తరహాలో దక్షిణాదిన ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగికి స్ట్రెచర్ ఏర్పాటు చేయకపోవడంతో.. భర్తను కాలుపట్టి ఓ భార్య స్కానింగ్ గదికి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపింది.
కర్ణాటకలోని షిమోగా జిల్లాలో కదల్లేని స్థితిలో ఉన్న తన భర్తను అతని భార్య ఎక్స్-రే గదికి నేలపైనే ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళింది. ఆమె పేరు ఫమీదా. తీవ్ర అస్వస్థతలో ఉన్న తన భర్త అమీర్ సాబ్‌ను ల్యాబ్‌కు తీసుకెళ్లేందుకు వీల్ చైర్ గానీ, స్ట్రెచర్ గానీ ఏర్పాటు చేయాలని ఫమీదా కోరగా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. దీంతో గత్యంతరం లేక అతడిని ఈడ్చుకుంటూ ల్యాబ్‌కు తీసుకెళ్లింది. దయనీయమైన ఈ వీడియో బయటపడడంతో ఈ సంఘటనపై విచారణ జరపాలని ప్రభుత్వాధికారులు ఆదేశించారు.
ఈ ఘటనపై ఆరోగ్య శాఖాధికారి ఒకరు మాట్లాడుతూ.. మే 25వ తేదీన ఊపిరితిత్తుల్లో ఏర్పడిన సమస్యతో అమీర్ సాబ్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఇతనికి వైద్యులు స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సిందిగా సూచించారు. వీల్ ఛైర్ల కొరత ఈ ఘటన జరిగిందని.. ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆరోగ్య శాఖాధికారి ఒకరు తెలిపారు.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :
,
,
,
,
,