శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జులై 2021 (11:12 IST)

వివాహమైన కొన్ని గంటల్లోనే వధువు మృతి.. కర్ణాటకలో దారుణం

వివాహమైన కొన్ని గంటల్లోనే వధువు ప్రాణాలు కోల్పోయింది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే వధువును మృత్యువు కబళించిన ఈ దుర్ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా సింధగి తాలూకా బి.కె.యలగల్ల గ్రామంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని రాణి (26)గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో పెండ్లి కొడుకు సహా ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 
 
పెండ్లి మంటపం నుంచి బంధువులతో కలిసి క్రూసర్‌ వాహనంలో నవ దంపతులు శుక్రవారం ఉదయం కూకటనూరు గ్రామానికి దైవదర్శనం కోసం వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టెంపో ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. నవ వధువు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రులు సింధగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సింధగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.