Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కర్ణాటక ఎన్నికల పోలింగ్.. ఓటేయండి.. వేడి వేడి దోసె, కాఫీ కొట్టండి..

శనివారం, 12 మే 2018 (12:31 IST)

Widgets Magazine

ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున క్యూ కట్టారు. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 
 
ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. అవగాహన కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించింది. అయితే ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఓ హోటల్‌ నిర్వహకుడు వినూత్న పద్ధతిలో ముందుకు వచ్చాడు. నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణ రాజ్‌ బెంగళూరులో ఓటింగ్‌ శాతం పెంచేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలెట్టాడు. 
 
కర్ణాటక పోలింగ్‌లో తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్న యువతకు తన హోటల్‌లో ఉచితంగా దోసె అందిస్తున్నాడు. అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఇతరులకు ఫిల్టర్‌ కాఫీని ఇస్తానని ఆఫర్ చేశాడు. ఈ ఉచిత దోసె, కాఫీని పొందాలంటే ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును హోటల్‌లో చూపించాల్సి ఉంటుంది. ఎవరికైనా ఓటేయండి.. కానీ ఓటు హక్కును వినియోగించుకోండని హోటల్ యజమాని కొత్త ప్రచారాన్ని చేపట్టాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా హత్యకు ఓ రాజకీయ పార్టీ కుట్ర.. సుపారీ కూడా ఇచ్చింది: మమత బెనర్జీ

కేంద్రంలోని ఎన్డీయేపై నిప్పులు చెరుగుతూ.. సర్కారు విధానాలను తప్పుబట్టే పశ్చిమబెంగాల్ ...

news

లైవ్: కర్ణాటక ఎన్నికల పోలింగ్.. బీజేపీ నేతల పూజలు.. అమిత్ షా కూడా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నేతలు పూజలు చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ...

news

సొంత డబ్బుతో టీడీపీ కార్యకర్తలు పనిచేస్తారు: చంద్రబాబు కితాబు

అలిపిరిలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటన కలకలం రేపిన ...

news

అలిపిరి ఘటన: బాబు క్షమాపణ చెప్పాలట.. అది నిరసన మాత్రమే దాడిలా చూడటం?

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసిన ...

Widgets Magazine