మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (15:07 IST)

సిద్ధరామయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీదర్ దేశద్రోహ కేసు ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడానికి ప్రయత్నించిన సిద్ధరామయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు దినేష్ గుండు రావు, రిజ్వాన్ అర్షద్, కె సురేష్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ చర్యతో సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తుందని సిద్దరామయ్య ఆరోపించారు. కాగా బీదర్‌లోని షాహీన్ ప్రైమరీ స్కూల్ పాఠశాలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జనవరి 30న నిరసన నాటకం ప్రదర్శించారు. దాంతో పాఠశాల హెడ్ ఫరీదా బేగం తోపాటు ఓ విద్యార్థిని తల్లి నజ్బున్నిసా అరెస్టు చేశారు.
 
ఈ నేపథ్యంలో వారిపై దేశద్రోహం ఆరోపణలు నమోదయ్యాయి. శుక్రవారం జిల్లా జైలులో ఉన్న ఈ ఇద్దరు మహిళలను కలుసుకుని వారితో చర్చలు జరిపారు సిద్దరామయ్య. ఆపై నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవడంతో పోలీసులు రంగంలోకి దిగి, అరెస్టు చేశారు.