సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 15 మే 2019 (09:06 IST)

పక్కింటి వ్యక్తితో అసభ్య భంగిమలో భార్య.. ఆనందానికి అడ్డుగా ఉన్నాడనీ భర్తను చంపేసిన భార్య

కర్ణాటక రాష్ట్రంలో మరో వివాహేతర హత్య జరిగింటి. పక్కింటి కుర్రోడితో కట్టుకున్న భార్యను చూడకూడని భంగిమలో ఆ భర్త చూశాడు. అదే అతనిపాలిట మరణశాసనంగా మారింది. తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. తన ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చింది. 
 
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు రూరల్ జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్ళాపూర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (30) అనే వ్యక్తికి వివాహమై భార్య ప్రతిభ (25) ఉంది. వీరిద్దరూ పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లు చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
శ్రీనివాస్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. ఇలా పచ్చగా సాగుతున్న వీరి సంసారంలో ప్రతిభ వివాహేతర సంబధం చిచ్చుపెట్టింది. ప్రతిభకు పక్కింట్లో నివసిస్తున్న బాలకృష్ణతో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఓ రోజున ప్రతిభ - బాలకృష్ణతో చూడకూడని భంగిమలో ఉండటాన్ని శ్రీనివాస్ కళ్ళారా చూశాడు. ఆ తర్వాత భార్యతో గొడవపడ్డాడు. 
 
తమ ఆనందానికి అడ్డుగా శ్రీనివాస్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్రతిభ, తన భార్యను కూడా చంపేయాలని బాలకృష్ణ తీర్మానించుకున్నారు. అయితే, ప్రతిభకు ప్రియుడు బాలకృష్ణ పూర్తి సహాయ సహకారాలు అందించడంతో తమ ప్లాన్‌ను త్వరితగతిన అమలు చేసింది. 
 
వీరి కుట్రలో భాగంగా, ప్రతిభ తన భర్త శ్రీనివాస్‌ను ఉద్యోగం ఒకటి ఉందని నమ్మించి చందాపుర సమీపంలోని సూర్యనగర్‌ బీఎంటీసీ బస్‌ డిపో వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న బాలకృష్ణ... శ్రీనివాస్‌ను కత్తితో గొంతుకోసి చంపారు. ఆ తర్వాత శవాన్ని సమీపంలోని చెరువులో పడేసి వెళ్లిపోయారు. అక్కడ నుంచి బాలకృష్ణ పారిపోయాడు.
 
ప్రతిభ అద్దె ఇంటిని యజమానిని కలిసి ఇల్లు ఖాళీ చేస్తున్నామని, అడ్వాన్స్‌ వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేసింది. ఓనర్‌కు ఆమె భర్త శ్రీనివాస్‌ కనబడకపోవడంతో అతని తమ్ముడు మధుకి సమాచారమిచ్చాడు. మధు గ్రామానికి చేరుకోగా ఇరుగుపొరుగు అంతా వివరించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ప్రతిభను అరెస్టు చేశారు. శ్రీనివాస్‌ శవాన్ని చెరువులో నుండి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరో నిందితుడు బాలకృష్ణ పరారీలో ఉన్నాడు.