బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (09:11 IST)

Omicron rules: కర్ణాటకలో వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. నో ఎంట్రీ?

Omicron
దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ టెన్షన్ మొదలైంది. బెంగళూరులో రెండు కేసులు.. హైదరాబాద్ వచ్చిన మహిళకు పాజిటివ్ వున్నట్లు తేలింది. దీంతో కర్ణాటక సర్కారు కోవిడ్‌కు సంబంధించిన ఆంక్షలు జారీ చేసింది. ఇందులో కరోనా వ్యాక్సినేషన్ వేసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. పార్కులు, షాపింగ్ మాల్స్, థియేటర్లు వంటి ప్రదేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోని వారు తిరిగేందుకు వీల్లేదని వెల్లడించింది. 
 
కొత్త ఉత్తర్వులు వచ్చే ఏడాది జనవరి 22 వరకు వుంటుందని కర్ణాటక సర్కారు తెలిపింది. అలాగే పాఠశాలల్లో ఎలాంటి సమావేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించింది. ముఖ్యమైన సమావేశాలు, వివాహాలకు పాల్గొనే వారి సంఖ్యను 500 మందికి మాత్రమే పరిమితం చేయాలి. అన్ని విద్యా సంస్థలలో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఫంక్షన్‌లు జనవరి 15, 2022 వరకు వాయిదా వేయబడతాయి.
 
పాఠశాలలు లేదా కళాశాలలకు వెళ్లే 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించాలి. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు మరియు థియేటర్లలోకి కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుంది. మాస్కులు ధరించని పక్షంలో రూ.250 ఇతర ప్రాంతాల్లో రూ.l00 జరిమానా విధించడం జరుగుతుంది.