శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (11:54 IST)

జ్యోతిష్యుడి మాటలు విని భార్యను బిడ్డను ఇంటి నుంచి గెంటేశాడు..

crime scene
జ్యోతిష్యుడి మాటలు విని ఓ వ్యక్తి భార్య, కన్నబిడ్డను ఇంట్లోంచి బయటకు పంపించేశాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన నవీన్‌ (35), శ్రుతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రుత్విక్‌ (2) అనే కుమారుడు ఉన్నాడు. 
 
ఆ చిన్నారి పుట్టిన నక్షత్రం వల్ల బిడ్డకు, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వల్ల నీకు కీడు జరుగుతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో.. ఆ మాటలు నమ్మి భార్యాబిడ్డను ఇంటి నుంచి గెంటేశాడు. ఇంట వుండేంతవరకు భార్యాబిడ్డపై వేధించేవాడు. నిత్యం హింసించేవాడు. 
 
ఇంట్లోంచి వెళ్లిపోవాలని లేదంటే పెట్రోల్‌ పోసి ఇద్దరినీ తగలబెడతానని బెదిరించడంతో శ్రుతి తన బిడ్డను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.