మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 4 ఆగస్టు 2021 (18:09 IST)

యడియూరప్ప కుటుంబం పూర్తిగా పక్కకి, కుమారుడికి నో ఛాన్స్

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై క్యాబినెట్‌లో 29 మంది కొత్త మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముందు నుంచి చెపుతున్నట్లు ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవి లేదు. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప చిన్న కుమారుడు బివై విజయేంద్రకు కూడా కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. దీనితో యడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారని అంటున్నారు.
 
కేబినెట్ మంత్రుల్లో అనుభవం వున్నవారితో పాటు యువకులకి స్థానం కల్పించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. కేబినెట్‌లో ఏడుగురు ఓబీసిలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఏడుగురు వొక్కలిగాలు, ఎనిమిదిమంది లింగాయత్‌లు, ఒక రెడ్డి కులస్తులు వున్నట్లు చెప్పారు. అలాగే ఒక మహిళ, బ్రాహ్మణ సంఘానికి చెందిన ఇద్దరు కూడా ఉన్నారని వెల్లడించారు.