కుమారస్వామికి బీఎస్పీ ఎమ్మెల్యే షాక్... ఓటింగ్‌కు దూరంగా...

bsp mla mahesh
Last Updated: ఆదివారం, 21 జులై 2019 (17:57 IST)
రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రభుత్వం ఎదుర్కొంటున్న రోజుకో విధంగా కీలక మలుపులు తిరుగుతోంది. కుమారస్వామి ప్రభుత్వానికి బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశం మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్ విశ్వాస పరీక్షకు దూరంగా ఉండనున్నారు.

కర్నాటకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెల్సిందే. అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌కు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హెచ్ డీ కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ప్రకటించిన బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ యూటర్న్‌ తీసుకున్నారు.

సోమవారం జరుగనున్న విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉండాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తనను కోరారని ఎమ్మెల్యే ఎన్ మహేశ్ అన్నారు. తాను పార్టీ (బీఎస్పీ) అధిష్టానం ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో సభకు హాజరు కాబోనని స్పష్టంచేశారు. తన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే మహేశ్ చెప్పారు.దీనిపై మరింత చదవండి :