మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జనవరి 2020 (09:27 IST)

ఆప్ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేజ్రీవాల్‌

దేశ రాజధాని అయిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే.

న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌ బరిలో దిగుతున్నారు. పట్పర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా పోటీ చేయనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసి ప్రతిపక్షాలకు ఊహించని షాకిచ్చారు.

‘ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 61 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చాం. 46 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పాత స్థానాల్లో పోటీ చేస్తారు. 15 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు చేశామని తెలిపారు.

గత ఎన్నికల్లో ఆరుగురు మహిళలకు సీట్లు ఇవ్వగా.. ఈసారి 8 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చామని, 9 అసెంబ్లీ స్థానాల్లో కొత్తవాళ్లకు టికెట్లు కేటాయించామని’ ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తెలిపారు.