శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:30 IST)

పట్టపగలే యువతిపై అత్యాచార యత్నం... రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే..?

దేశంలో మహిళలపై విచ్చలవిడిగా అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కేరళ మలప్పురం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 21 ఏళ్ల యువతిపై ఓ 15 ఏళ్ల బాలుడు పట్టపగలే అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించాడు. అంతేగాక.. సదరు యువతి ముఖంపై రాయితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు.
 
వివరాల్లోకి వెళితే.. మలప్పురం జిల్లా కొండొట్టీలో సోమవారం మధ్యాహ్నం.. ఓ యువతి నడుచుకుంటూ వెళ్తోంది. అయితే.. ఆమెను అనుసరించిన ఓ బాలుడు. ఆకస్మాత్తుగా రోడ్డు పక్కకు బలవంతంగా లాగాడు. ఆపై అత్యాచారానికి యత్నించాడు. సదరు యువతి ఏడుస్తూ, అతడిని ప్రతిఘటించింది.
 
దాంతో బాలుడు ఓ రాయి తీసుకుని ఆమె ముఖంపై దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆమె.. సమీపంలోని ఓ ఇంటికి సాయం కోసం పరిగెత్తింది. స్థానికులు బయటకు వచ్చి నిందితుడి కోసం వెతికారు. కానీ, అప్పటికే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.