గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (13:48 IST)

32ఏళ్ల యువకుడితో 42 మహిళకు లింక్.. పదేళ్లు చిన్నవాడైనా..?

ప్రపంచ వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో పాలక్కాడ్ జిల్లాలో అలాంటి ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఓ బ్యూటీషియన్ దారుణ హత్యకు గురైంది. కొల్లామ్ జిల్లాకు చెందిన ఓ బ్యూటీషియన్ వయస్సు 42 సంవత్సరాలు. 
 
ఆమె ఇటీవల తాను పనిచేసే బ్యూటీషియన్ సెంటర్లో సెలవు కావాలని అడిగింది. అయితే లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో 32 ఏళ్ల వ్యక్తితో సన్నిహితంగా వున్నట్లు తేలింది. 
 
మనాలీకి చెందిన కీ బోర్డు ప్లేయర్ ప్రశాంత్ (32) సోషల్ మీడియా ద్వారా సుచిత్రకు పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు తేలింది. సుచిత్ర ప్రశాంత్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న ప్రశాంత్ ఆమె మెడకు వైరు బిగించి చంపేశాడు. అనంతరం శవాన్ని తన ఇంట్లోనే పాతిపెట్టాడు.
 
పోలీసులు ప్రశాంత్‌ను తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని అరెస్టు చేశారు. ఏదేమైనా తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అబ్బాయి ప్రేమ ఈ బ్యూటీషియన్ జీవితాన్ని అర్థాంతరంగా క్లోజ్ చేసేసింది.