Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇక రిసార్ట్స్ రాజకీయాలు... కర్ణాటక ఎమ్మెల్యేలకు కేరళ పర్యాటక మంత్రి ఆహ్వానం

బుధవారం, 16 మే 2018 (11:42 IST)

Widgets Magazine

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే, 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. కాంగ్రెస్ - జేడీఎస్‌లు జట్టుకట్టి కమలనాథుల ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో కన్నడ రాజకీయాలు ఇపుడు రాజ్‌భవన్‌కు చేరాయి. పైపెచ్చు రిసార్ట్స్ రాజకీయాలకు అన్ని రాజకీయ పార్టీలు తెరలేపాయి. దీంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కేరళ పర్యాటక శాఖ నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను ఆహ్వానిస్తూ ఈ ట్వీట్ చేసింది.
kerala tourism
 
ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొని ఎంతో అలసిపోయారు కనుక, కొంత సేదదీరేందుకు పర్యాటక ప్రాంతమైన తమ రాష్ట్రానికి రావాలని వారిని ఆహ్వానించింది. ఎంతో అందమైన, సురక్షితమైన తమ రిసార్ట్స్‌లో సేదదీరాల్సిందిగా కోరింది. దీనిపై కొత్త ఎమ్మెల్యేల స్పందన సంగతి అలా ఉంచితే, నెటిజన్లు మాత్రం భిన్న వ్యాఖ్యలు చేశారు. కేరళ టూరిజం శాఖ ఆలోచన అద్భుతమని కొందరు, కొత్త ఎమ్మెల్యేలను అక్కడికి పిలిపించి రాజకీయాలు చేయాలనుకుంటున్నారా! అని మరికొందరు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏది ఏమైనా కర్ణాటక రాజకీయాలు ఇకపై రిసార్ట్స్ వేదికగా సాగనున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
కర్ణాటక ఎమ్మెల్యే అసెంబ్లీ Tweets Majority కేరళ పర్యాటక శాఖ Karnataka Mla Kerala Tourism

Loading comments ...

తెలుగు వార్తలు

news

మరో దాచేపల్లి కారాదు... పాతగుంటూరు రేప్‌పై సీఎం సీరియస్

గుంటూరు జిల్లా దాచేపల్లిలో 8 యేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత ...

news

లాంచీ ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన.. ఏమన్నారంటే...

గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా ...

news

కింగ్ మేకర్ కాదట.. కర్ణాటక కింగేనట ... తండ్రి బాటలో తనయుడు...

మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమార స్వామి. ఈయన ఇపుడు కర్ణాటక రాజకీయాల్లో 'కింగ్ మేకర్'. ...

news

రంజుగామారిన కర్ణాటక రాజకీయం.. గవర్నర్‌ కోర్టులో బంతి

కర్ణాటక రాజకీయం రంజుగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు బంతి ఇపుడు గవర్నర్ కోర్టులో పడింది. ...

Widgets Magazine