శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (18:27 IST)

కొండ చరియలు విరిగిపడ్డాయి.. ప్రాణాలతో బయటపడ్డాం.. వీడియో వైరల్

హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో ఘోర దుర్ఘటనలో తొమ్మిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొండ చరియలు విరిగిపడటంతో ఓ బ్రిడ్జికూడా కూలిపోయింది. ఇదే ఘటనలో రాజస్థాన్‌కు చెందిన వైద్యురాలు దీపాశర్మ దుర్ఘటన జరగటానికి 25 నిమిషాల ముందు తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరలైంది.

అయితే తాజాగా ఘటన సందర్భంలో గాయాలతో బయటపడ్డ బాధితుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియో ఘటన జరిగిన సందర్భంలో సెల్ ఫోన్ తో ప్రమాదం నుండి బయటపడినవారి నుండి ఘటన వివరాలను చిత్రీకరించారు.
 
నవీన్, శిరిల్ అనే ఇద్దరు వ్యక్తులు తలకు గాయాలతో వీడియోలో కనిపిస్తున్నారు. వారిలో ఒకరు చెప్పిన సమాచారం బట్టి ఘటన జరగటానికి 10 నిమిషాల ముందు ఘాట్ రోడ్డులో కారు నిలిపి ఉంచామని , కొండ పైభాగం నుండి బండరాళ్ళు ఒక్కసారిగా దూసుకురావటంతో తమ కారు నుజ్జునుజ్జు అయిందని తెలిపాడు. 
 
ఎలాగోలా తాను ప్రాణాలతో కారునుండి బయటపడ్డానని… కొద్ది సేపటి తరువాత పెద్ద మొత్తంలో దుమ్ముదూళి, రాళ్ళు పడిపోవటంతో కారు ఆనవాలే కనిపించకుండా పోయిందన్నాడు. విరిగిపడ్డ కొండచరియల దృశ్యాలు చాలా స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నాయి. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.