శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: గురువారం, 29 జనవరి 2015 (06:34 IST)

ఒక కిరణ్ బేడీ... రెండు ఓటరు కార్డులు... అదేలా?

చెప్పేటందుకే నీతులు ఉంటాయనడానికి కిరణ్ బేడీ ఓటరు కార్డులే ఉదాహరణ. అలాగే చట్టాలన్నీ సామాన్యులకే తప్ప తమకు కాదన్నట్లు నాయకులు వ్యవహరిస్తుంటారు. కిరణ్ బేడీ విషయంలో ఇదే జరిగింది. ఒకే వ్యక్తి రెండు ఓటరు కార్డులు కలిగి ఉండడం చట్ట ప్రకారం ఎలా సాధ్యం.. మరి అదే ఢిల్లీ సిఎం బరిలో నిలిచిన కిరణ్ బేడీకి రెండు ఓటరు కార్డులు కలిగి ఉన్నారు తెలుసా... కావాలంటే టీజెడ్‌డీ1656909, ఎస్‌జెఈ0047969 చూడడండి. రెండూ.. ఆమె పేరు మీదే జారీ అయినవే.. ఇది ఎలా జరిగింది? ఎవరు చేశారు? 
 
ఎన్నికల కమిషన్(ఈసీ) రికార్డుల ప్రకారం ఉదయ్‌పార్క్, తల్కతోరా లేన్ చిరునామాలతో ఆమెకు రెండు ఓటరు కార్డులు(టీజెడ్‌డీ1656909, ఎస్‌జెఈ0047969) ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇవి ఎలా జారీ అయ్యాయో తేల్చేందుకు విచారణ చేపట్టినట్లు ఈసీ తెలిపింది. ఢిల్లీ ఎన్నికలల్లో పోటీ చేస్తున్న ఆమె నామినేషన్ పత్రాల్లో ఆమె ఉదయ్‌పార్క్ చిరునామాలో ఉంటున్నట్లు పేర్కొన్నారు.  మొదటి కార్డు(తల్కతోరా)ను తొలగించాలని ఆమె దరఖాస్తు చేశారో లేదో ఇంకా ఎన్నికల సంఘానికి తెలియదు. ఆమె ఉద్దేశ పూర్వకంగా రెండు కార్డులు కలిగి ఉన్నారా లేక పొరబాటున జారీ అయ్యాయా అనేది తేలాల్సి ఉంది. 
 
ఇదిలా ఉండగా, కిరణ్ బేడీపై విమర్శనాస్త్రాలు సంధించడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి అవకాశమే లభించింది. ఈ ఉదంతంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.  కాగా, ప్రత్యర్థి పార్టీ సీనియర్ నేత ఒకరు తమ పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థులపై మీడియాలో దుష్ర్పచారం చేయడానికి కుట్రపన్నారని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు.