మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:15 IST)

కోల్‌కతా మున్సిపల్ ఎన్నికలు : బీజేపీ చిత్తు చిత్తు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చావుదెబ్బలు వరుసగా తగులుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. 
 
ఇపుడు కోల్‌కతా నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో మరోమారు చావుదెబ్బ తగిలింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. 
 
ఈ ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తుంది. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు టీఎంసీ ఏకంగా 69 చోట్ల ఆధిక్యంలో ఉండగా బీజేపీ కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రభావం ఇసుమంతైనా కనిపించక పోవడం గమనార్హం.