గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (08:33 IST)

కోల్‌కతాలో దారుణం : యువతిని కట్టేసి సామూహిక అత్యాచారం

వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం జరిగింది. యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి ముందు ఆ యువతిని దుండగులు తాళ్ళతో కట్టేశారు. ఆ తర్వాత గ్యాంగ్ రేప్ చేశారు. ఆపై, 15 లక్షల రూపాయలను చోసుకుని పారిపోయారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌‌లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. అత్యాచారానికి ముందు యువతిని కట్టేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కోల్‌కతా డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.