శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (09:25 IST)

కుప్పూరు మఠాధిపతిగా 13 యేళ్ల బాలుడు

కర్నాటక రాష్ట్రంలో అనేక మఠాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో కుప్పూరు గద్దుగె మఠం ఒకటి. ఈ మఠానికి అధిపతిగా తేజస్‌ కుమార్‌ అనే 13 యేళ్ళ బాలుడు ఎంపికయ్యాడు. 
 
తుమకూరు జిల్లా చిక్కనాయనహళ్లి తాలూకాలో ఉన్న ఈ మఠానికి ఇప్పటివరకు అధిపతిగా ఉన్న యతీంద్ర శివాచార్య స్వామీజీ కొవిడ్‌ బారినపడి ఈ నెల 25వ తేదీన మృతి చెందిన విషయం తెల్సిందే. 
 
ఆయన మరణించే ముందు తన వారసునిగా తేజస్‌ కుమార్‌ పేరును ప్రకటించారు. మఠాధిపతికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారసుడు తప్పనిసరి కావడంతో బాలుడిని ఎంపిక చేశారు 
 
ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జె.సి.మాధుస్వామి, ఇతర మఠాల అధిపతులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో కొత్త మఠాధిపతి పేరు ప్రకటించారు. కొత్త మఠాధిపతి చేతుల మీదుగా యతీంద్ర శివాచార్య అంత్యక్రియలు జరిపించారు. 
 
ఎనిమిదో తరగతి చదువుతున్న తేజస్‌ కుమార్‌ 2008, ఏప్రిల్‌ 22న జన్మించారు. మైసూరు సుత్తూరు మఠంలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించే అవకాశముంది. అలాగే, మఠం కార్యకలాపాలను మరో వ్యక్తి చేసుకునే అవకాశం ఉంది.