గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (10:28 IST)

శృంగారం కోసం వేధిస్తోందనీ లేడీ బాస్ గొంతు కోసిన టీనేజర్.. ఎక్కడ?

కొన్ని నెలులుగా శృంగారం కోసం ఒత్తిడి చేస్తున్న లేడీ బాస్ గొంతు కోసేశాడు ఓ టీనేజర్. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను చేసిన పని చెప్పి లొంగిపోయాడు. ఢిల్లీలోని లజపత్ నగర్‌లో జరిగిన ఈ వివరాలన

కొన్ని నెలులుగా శృంగారం కోసం ఒత్తిడి చేస్తున్న లేడీ బాస్ గొంతు కోసేశాడు ఓ టీనేజర్. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను చేసిన పని చెప్పి లొంగిపోయాడు. ఢిల్లీలోని లజపత్ నగర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అయితే ఆ ఇంటి యజమానురాలు శృంగారం కోసం ఈ బాలుడిని వేధిస్తూ వచ్చేది. ఇలా చాలా కాలంగా ఒత్తిడి చేస్తూ వస్తోంది. దీంతో విసిగిపోయిన తాను.. మరోసారి ఒత్తిడి చేస్తే చంపేస్తానని కూడా హెచ్చరించానని తెలిపాడు.
 
అయినా ఆమె తీరులో మార్పు రాకపోవడంతో ఆమెను అంతమొందిస్తే తప్ప వేధింపులు ఆగవని భావించాడు. అనుకున్నదే తడవుగా ఆమె టీవీ చూస్తున్న సమయంలో వెనుక నుంచి వెళ్లి, గొంతు కోసి, హత్య చేశాడు. 
 
ఆ తర్వాత నేరుగా సాహిబాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఏడ్చుకుంటూ వచ్చి జరిగినదంతా చెప్పి లొంగిపోయాడు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపించామని పోలీసులు తెలిపారు.