బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (09:15 IST)

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు... ఏడుగురు దుర్మరణం

ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పితోర్‌గఢ్‌ జిల్లా జుమా గ్రామంలోని జామ్రి, తర్కోత్‌ ప్రాంతాల్లో కొండ చరియలు కూలిపడి, బురద ప్రవాహం ముంచెత్తింది.

ఇప్పటివరకు మూడు మృత దేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి ట్వీట్‌ చేస్తూ గాలింపు చర్యలను ఉధృతం చేయాల్సిందిగా జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

గత నాలుగైదు రోజుల నుండి జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. గత వారం జోషి గ్రామంలో రిగిన ఘటనలో యువతి ఆచూకీ తెలియరాలేదు.

మంగళవారం కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు వున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ వర్షాల కారణంగా, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి.