Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అద్దె చెల్లించాల్సిందే... లతా రజినీకాంత్‌కు చుక్కెదురు

బుధవారం, 22 నవంబరు 2017 (11:00 IST)

Widgets Magazine
latha rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ విద్యా సంస్థలతో పాటు.. ఓ ట్రావెల్ సంస్థను కూడా నడుపుతోంది. ఈ రెండు కూడా అపుడపుడూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తాజాగా ట్రావెలర్స్ సంస్థ దుకాణం అద్దె పెంపు వ్యవహారంలో ఆమెకు కోర్టులో చుక్కెదురైంది. చెన్నై నగర పాలక సంస్థ నిర్ణయించిన అద్దెను చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో భవన సముదాయాలలోని ఓ గదిని అద్దెకు తీసుకుని ట్రావెలర్స్‌ సంస్థను నడుపుతున్నారు. కొన్నేళ్లుగా ఆ దుకాణానికి నెలకు రూ.3702లను కార్పొరేషన్‌కు అద్దెగా చెల్లిస్తూవచ్చారు. గత జూన్‌లో కార్పొరేషన్‌ ఆ దుకాణం ఉన్న గది అద్దెను రూ.21,160లకు పెంచింది. ఈ అద్దె పెంపును సవాలు చేస్తూ కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 
 
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి వైద్యనాథన్‌ విచారణ జరిపి అద్దెను రూ.21160గా ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు 92 ప్రకారం ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి అద్దెకిచ్చిన కార్పొరేషన్‌ భవనాల అద్దెను పెంచాల్సి ఉందని, లతా రజనీకాంత్‌ నడుపుతున్న ట్రావెలర్స్‌ సంస్థ అద్దెను కూడా ఆ చట్టం ప్రకారంమే చెల్లించాల్సిందని స్పష్టం చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎందుకు బతికున్నావు.. చచ్చిపో... నారాయణ విద్యార్థినికి టీచర్ వేధింపులు

"నువ్వు కడుపునకు గడ్డితింటున్నావా? మట్టి తింటున్నావా? ఎందుకు బతికున్నావు.. చచ్చిపో! నా ...

news

జింబాబ్వేలో ముగాబే పాలనకు తెర... తెరవెనుక ఏం జరిగిందంటే..

జింబాబ్వేలో మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన రాబర్ట్ ముగాబే పాలనకు తెరపడింది. 93 యేళ్ళ ...

news

మానుషి చిల్లర్ డైట్ సీక్రెట్స్... 3 గ్లాసుల గోరువెచ్చని నీరు...

హర్యానా రాష్ట్రానికి చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017గా ఎన్నికైంది. దాదాపు 17యేళ్ళ ...

news

28 నుంచి హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభం

హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌కు వచ్చే ...

Widgets Magazine