బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:56 IST)

ప్రపంచ దేశాల్లో భారత్ తొలి స్థానం.. సన్ స్ట్రోక్ ఖాయం.. జాగ్రత్తగా వుండకపోతే..?

Summer
ఏప్రిల్, మే నెలలో జాగ్రత్తగా వుండకపోతే సన్ స్ట్రోక్ ఖాయమంటోంది వాతావరణ శాఖ. ఇప్పటికే రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హీట్ వేవ్ ముప్పు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉందని ఓ నివేదిక వెల్లడించింది. 
 
ఒక్క వేసవిలోనే కాదు ఇతర కాలాల్లోనూ మన దేశంలో వేడి వాతావరణం సర్వ సాధారణంగా మారిపోయింది. గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతున్న దేశాల్లో మన దేశం తొలి స్థానంలో ఉందని వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదిక చెప్తోంది. 
 
వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. ఇప్పటికే 40, 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి మార్చి నెలలో రావడం హెచ్చరికగా భావిస్తున్నారు వాతావరణ నిపుణులు.