Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిన్నమ్మ కీలుబొమ్మ పళనికి ఎమ్మెల్యేల మద్దతు.. ప్రజాభిప్రాయం ఉన్నా పన్నీరుకు కన్నీరు..

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (12:05 IST)

Widgets Magazine

తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమ్మ డీఎంకే పేరిట.. జయలలిత మేనకోడలు దీప, పన్నీర్ సెల్వం వేరు కుంపటి పెట్టుకునేందుకు సంసిద్ధమవుతున్నట్లు తేలిపోయింది. అమ్మ మరణం వెనుక శశికళ హస్తముందని సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ.. చిన్నమ్మను ఏకిపారేసిన పన్నీర్ సెల్వం అమ్మ నడిపిన పార్టీ నుంచి ఇప్పటికే వెలివేయబడ్డారు. 
 
అంతేగాకుండా ఎమ్మెల్యేలు సైతం మన్నార్ గుడి మాఫియాకు సపోర్ట్ చేయడంతో.. పళని స్వామి సీఎం అభ్యర్థిగా బలపరీక్ష చేయించుకోనున్నారు. ఆ బల పరీక్ష కూడా సెల్వం చేతుల మీదుగా జరుగనుంది. అయితే పన్నీర్ సెల్వంకు ఆయన తరపు ఎమ్మెల్యేలకు చిన్నమ్మ చేసిన సీన్ మింగుడుపడట్లేదు. చిన్నమ్మకు వ్యతిరేకంగా.. అమ్మ మరణానికి ఆమే కారణమని బహిరంగంగా చెప్పినా.. ఆమె వెంట ఎమ్మెల్యేలు పోవడంపై పన్నీర్ సెల్వం నిరాశ చెందారు. ధర్మం గెలుస్తుందనుకుంటే.. కుట్రలు కుతంత్రాలకే రాజకీయాల్లో స్థానమైపోయిందని.. సన్నిహితులతో పన్నీర్ సెల్వం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పన్నీరుకు, ఆయన తరపు ఎమ్మెల్యేలకు దిక్కుతోచని పరిస్థితి. ఫలితంగా వేరు కుంపటి  పెట్టేందుకు పన్నీర్ రెడీ అయిపోతున్నారు.
 
అమ్మ పేరిట దీపతో కలిసి కొత్త పార్టీని నెలకొల్పేందుకు రంగం సిద్ధమవుతోంది. చిన్నమ్మ చేతిలో అన్నాడీఎంకే పార్టీ నలిగిపోనుందని.. ఆ పార్టీ త్వరలో మన్నార్ గుడి మాఫియా చేతికి వెళ్ళనుందని.. నిజాయితీగా పార్టీకి కాపాడుకోవాలనుకున్న తనకు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకపోవడం దారుణమని పన్నీర్ భావిస్తున్నారు. అయితే అన్నాడీఎంకే పార్టీకి వినాశనం ఖాయమని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. ఇక శశికళ తన బంధువులకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో పార్టీలో అసమ్మతి ఉన్నా ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మేలు కోసం చిన్నమ్మ కీలుబొమ్మ పళని స్వామిని సీఎంగా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గోల్డెన్ బే రెసార్ట్.. పళని స్వామిదే.. సోషల్ మీడియా జోకే నిజమైంది.. ఎలాగో తెలుసా?

గోల్డెన్ బే రెసార్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసార్ట్‌లో శశికళ వర్గం ...

news

అమ్మో.. అంత డబ్బా.. భారీ నగలు.. చీరలు, గడియారాలు బాగానే కూడబెట్టారుగా

దివంగత సీఎం జయలలిత.. ఆమె నెచ్చెలి శశికళ భారీ విలువ చేసే నగలను కూడబెట్టుకున్నారు. సుప్రీం ...

news

నా భర్త అశ్లీల చిత్రాలు చూస్తూ... నాతో సెక్స్ చేయడం లేదు: కోర్టుకు భార్య

నా భర్త అశ్లీల చిత్రాలు చూస్తూ.. తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, శారీరక సుఖాన్ని దూరం ...

news

భర్త పోర్న్‌కు బానిసయ్యాడు.. సుప్రం కోర్టును ఆశ్రయించిన భార్య.. ఆ సైట్లపై నిషేధం విధించండి..

భర్త పోర్న్ వీడియోలు చూస్తున్నాడని.. ఆ భార్య సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశ అత్యున్నత ...

Widgets Magazine