గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (11:47 IST)

రాహుల్ గాంధీకి షాకిచ్చిన ట్విట్టర్ : ఖాతా సస్పెండ్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ యాజమాన్యం షాకిచ్చింది. ఆయన ఖాతాను సస్పెండ్ చేసింది. కొద్ది సేపు మాత్రమే సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ పునరుద్ధరించింది. 
 
రాహుల్ గాంధీ ఖాతాను సస్పెండ్ చేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. దాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని.. ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా రాహుల్ గాంధీ తన గళాన్ని వినిపిస్తారని తెలిపింది. 
 
ఆ తర్వాత కాసేపటికే ఆయన ఖాతా రీయాక్టివేట్ అయింది. ఢిల్లీలో దుండగుల లైంగిక దాడిలో మరణించిన 9 ఏళ్ల దళిత బాలిక కుటుంబాన్ని రాహుల్ గాంధీ బుధవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ ట్వీట్‌పై దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని ఖాతాను కాసేపు నిలిపివేశారు.
 
మరోవైపు, ఈ వ్యవహారంపై జాతీయ పౌర హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫొటోను సోషల్ మీడియాలలో పోస్ట్ చేసినందుకుగాను ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. జువైన్ జస్టిస్ యాక్ట్‌తో పోక్సో చట్టాలను ఆయన ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.